హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాంపల్లి కాలనీలో సద్దుల బతుకమ్మ

HYD: ఉప్పల్, అంబర్‌పేట్ పరిధిలోని రాంపల్లి సంతోష్ నగర్ కాలనీలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.