హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధిని చూసి ఓటెయ్యండి'

AKP: నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి పలు వార్డు అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం రెల్లి వీధిలోని రామాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని ప్రజలను కోరారు.