హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి

అన్నమయ్య: దసరా సందర్భంగా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సతీమణి హరితమ్మతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణారెడ్డి, చైర్మన్ మనోజ్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.