హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సర్పంచ్ పై కోతి దాడి..!

ELR: జిల్లాలో వానరాల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. మండల కేంద్రమైన ఉంగుటూరులో మాజీ సర్పంచ్ దొంతంశెట్టి అరుణపై సోమవారం ఉదయం వానరం దాడి చేసింది. ఇంటి వద్ద రోజూవారీ పనులు చేసుకుంటున్న అరుణ మెడపై ఒక్కసారిగా కోతి దాడి చేసింది.  చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 12న వానరాలను పట్టించిన ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.