PLD: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు–2026 నిర్వహణపై RO అమల కుమారి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు, జోనల్, రూట్ ఆఫీసర్ల విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, మద్యం దుకాణాల పర్యవేక్షణపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై అధికారులకు అవగాహన సమావేశం


