KMR: దసరా పండుగ సందర్భంగా జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో పాలపిట్టలను బంధించరాదని జుక్కల్ రేంజ్ బీట్ ఆఫీసర్ రాములు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. పాలపిట్టలను బంధించినట్లు తెలిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని పేర్కొన్నారు.
తెలంగాణ
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు


