హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమిపూజ

NZB: బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. కార్యాలయ నిర్మాణంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ తోట వంశీ, మాజీ సర్పంచ్ మల్లెపూల రవీందర్ గౌడ్, కార్యదర్శి రాజ్కుమార్, పాలకవర్గ సభ్యులు, విడిసి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.