హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధపూజ

VZM: బొబ్బిలి కోటలో రాజుల కాలం నాటి సంప్రదాయాలకు అనుగుణంగా ఇవాళ ఆయుధపూజ నిర్వహించారు. దర్బార్ మహల్లో బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు, బంగారు సింహాసనానికి ప్రత్యేక పూజలు చేశారు. రాజవంశీయులు సుజయకృష్ణ రంగారావు, బేబినాయన, రామ్నాయన పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.