KKD: తుని పట్టణం వీరవరపుపేట సెంటర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం వేగంగా వచ్చిన కారు ఒక హోటల్, పాన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రెండు వాహనాలను, నలుగురిని ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తునిలో కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు


