PPM: వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్గోపాల్ ఆదేశించారు. పట్టణంలోని 24, 25వ వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయాల పనితీరు పక్కాగా ఉండాలి'


