ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఈనెల 16న ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సీనియర్ బీజేపీ నేత ఎల్.కే. అద్వానీ ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు. సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఆయనను ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
వార్తలు
ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జ్


