హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని ఆవేదన

GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి వార్డుల కేటాయింపులో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని బ్రాహ్మణ సంఘ నాయకులు ఆరోపించారు. 20వ వార్డును బ్రాహ్మణులకు కేటాయిస్తామని టీడీపీ నాయకులు గతంలో హామీ ఇచ్చారని, అయితే జనసేన పార్టీ నుంచి వేరే సామాజిక వర్గానికి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి మంచి కోరే బ్రాహ్మణులకు అన్యాయం చేయడం తగదన్నారు.