హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం!

కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA ఎస్వీ మోహన్ ఆధ్వర్యంలో సోమవారం 1వ వార్డులో ప్రారంభించారు. మేయర్ అభ్యర్థి సుశీల, కార్పొరేటర్ అభ్యర్థి పింజరి జూలేక బీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.