MNCL: తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్తులంతా బతుకమ్మ సంబరాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కొందరు దుండగులు పలు ఇళ్లలో చోరీకి యత్నించారు. మూడు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు సుమారు 20 తులాల వెండి అపహరించి పరారయ్యారు. సోమవారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బోయపల్లి గ్రామంలో దొంగల బీభత్సం.. పలు ఇళ్లలో చోరీ


