MHBD: దసరా ఉత్సవాల్లో భాగంగా తొర్రూరులోని యతిరాజారావు పార్కు ప్రాంగణంలో నిర్వహించనున్న రావణాసుర వధ కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన వెంట సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
రావణాసుర వధ ప్రాంగణాన్ని పరిశీలించిన డీఎస్పీ


