హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యతకు తూట్లు: అధికారుల పర్యవేక్షణ కరువు

NGKL: జిల్లాలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.2.40 కోట్లతో చేపట్టిన కల్వర్టు, రోడ్డు పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీరాజ్ DE గోవింద్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామన్నారు.