హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో దసరా నవరాత్రి పండగ సందడి

ATP: గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద దసరా నవరాత్రి పండుగ సందర్భంగా పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి అలంకరణకు అవసరమైన పసుపు, కుంకుమ, తోరణాలు, కలశ సామాగ్రి, పూజా ద్రవ్యాల అమ్మకాలు జోరందుకున్నాయి. రేపు దసరా పండుగ కావడంతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది.