హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్రిశూల్ పహాడ్‌ దాండియా వేడుకల్లో పాల్గొన్న MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాండియా ఉత్సవాల్లో MLA హరీష్ బాబు సోమవారం పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిశూల్ పహాడ్ గొప్ప సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకుందన్నారు. మంగళవారం దసరా పండుగ సందర్బంగా నిర్వహించే రావణ దహన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.