హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి దంపతులు

KNR: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా ముగిశాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు 9 రోజుల పాటు గ్రామగ్రామాన సాగాయి. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడగా, బండి సంజయ్ దంపతులు సంబరాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.