హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిరేకల్ మార్కెట్ 4 రోజులు బంద్

NLG: విజయదశమి పండుగ సందర్భంగా నకిరేకల్ నిమ్మకాయల మార్కెట్‌కు నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 23 నుంచి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని మార్కెట్ కమిటీ తెలిపింది. రైతులు, వ్యాపారులు విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ సందర్భంగా సమస్త రైతులు, వ్యాపారులకు కమిటీ దసరా శుభాకాంక్షలు తెలిపింది.