హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా తాగునీరు.. పట్టించుకోని అధికారులు

WGL: వరంగల్ మున్సిపల్ కార్యాలయం నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లే రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీతో వారం రోజులుగా నీరు వృథాగా మురుగు కాలువల్లో కలుస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.