PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామంలోని మూలమలుపు వద్ద అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి పొలంలో పడటంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీణవంక మండలం కల్లుపల్లికి చెందిన రాహుల్, రహీం ప్రమాదానికి గురయ్యారు. సద్దుల బతుకమ్మ ఉత్సవాల పర్యవేక్షణకు వెళ్తున్న SI సుధాకర్ క్షతగాత్రులను తన వాహనంలో శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు


