హైదరాబాద్: 28°C
తెలంగాణ

OU పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

HYD: ఉస్మానియా యూనివర్సిటీ 2026 విద్యా సంవత్సరానికి 53 సబ్జెక్టుల పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. నవంబర్ 14 నుంచి 16వరకు రోజుకు 3 విడతల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని డైరెక్టర్ పాండురంగా రెడ్డి తెలిపారు. నవంబర్ 10 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షకు ముందే కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు.