హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురిలో సిద్ధి ధాత్రి అలంకారంలో అమ్మవారు

JGL: ధర్మపురి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సోమవారం 9వ రోజు అమ్మవారు సిద్ధిధాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు మూల విగ్రహానికి పంచామృతాలు, గందోదకంతో అభిషేకాలు నిర్వహించి సింహ వాహనంతో అలంకరించారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.