MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మేదరి వాడలో శ్రీ కనకదుర్గ యూత్ అసోసియేషన్ వారు దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారిని వేద పండితులు మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశారు.
తెలంగాణ
శ్రీమహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం


