MDK: హైదరాబాద్ నుంచి మెదక్‌కు కారులో వస్తుండగా నర్సాపూర్ మార్గంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో మెదక్ ఏఆర్ ఎస్సై ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లా SP శ్రీనివాసరావుతో పాటు, పలువురు పోలీసు అధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్సై మృతి


