హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గా నగర్ వద్ద నాలా గుంతతో పొంచి ఉన్న ప్రమాదం

ADB: మావల మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై దుర్గానగర్ కాలనీ మలుపు వద్ద నాలా గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు అదుపుతప్పి గుంతలో పడితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతపై స్లాబ్ నిర్మించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.