హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే విజయదశమి.. పండగకు సిద్ధమైన ప్రజలు

MLG: విజయదశమి పండగ రేపు జరగనున్న నేపథ్యంలో ములుగు జిల్లా ప్రజలు వేడుకలకు సిద్ధమవుతున్నారు. దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, పాలపిట్టను దర్శించుకోవడం సంప్రదాయంగా పాటిస్తారు. పండగ రోజున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రావణాసుర వధ కార్యక్రమం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.