హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబాత్రయ ఆశ్రమంలో నవరాత్రి జాతర

NRPT: ఊట్కూర్ మండలం అంబాత్రయ క్షేత్ర ఆశ్రమంలో శరన్నవరాత్రుల సందర్భంగా జాతర ఘనంగా జరుగుతోంది. అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించారు. ఆశ్రమంలోని స్వాములు పసుపు బండారి చల్లుకుని భక్తి పారవశ్యంతో పూజలు చేశారు. అమ్మ కుశాయ చిత్రానికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.