HYD: నగరంలో ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వేల మంది సందర్శకులు తరలిరాగా, వందల మంది మహిళలు ఒక్క తీరుగా చప్పట్లు కొడుతూ పాడిన పాటలతో హుస్సేన్ సాగరం పులకించింది. సినీ నటులు విజయ్, రష్మిక మంథన దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, విదేశీ అతిథులు, అధికారులు కూడా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ అనందంగా గడిపారు.
తెలంగాణ
అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు


