హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడకు భవానీ స్పెషల్‌ బస్సులు

E.G: గోకవరం డిపో నుంచి విజయవాడకు భవానీ భక్తుల కోసం ఈ నెల 19, 20, 21తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ అజయ్‌బాబు తెలిపారు. దీంతో సాధారణ బస్సుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు బస్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పనులుంటేనే ప్రయాణాలు చేయాలని, ఆర్టీసీకి సహకరించాలని కోరారు.