హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండూరు–మానూర్ మార్గంలో చిరుత కళకళం

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని గుండూరు–మానూర్ మార్గంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత సంచారంపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.