హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీ-20 లీగ్‌కు 30 మంది మహిళా క్రికెటర్ల ఎంపిక

మహబూబ్‌నగర్ ఎండీసీఏ గ్రౌండ్‌లో నాలుగు ఉమ్మడి జిల్లాల మహిళా క్రికెటర్ల కోసం నిర్వహించిన 9 రోజుల ప్రత్యేక శిక్షణ ముగిసింది. ఇందులో పాల్గొన్న 50 మంది క్రీడాకారిణుల్లో ప్రతిభ కనబరిచిన 30 మందిని రెండు జట్లుగా ఎంపిక చేసినట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం. రాజశేఖర్ వెల్లడించారు.