హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట - ఖమ్మం హైవే పై కారు బోల్తా.!

సూర్యాపేట—ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.