హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతల కేసు.. జడ్జికి బెదిరింపులు

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపి అరెస్టయిన సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ల బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీనిపై ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ బెదిరింపులతో తమకు సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది.