హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెల్లవారుజామున యువకుడి హత్య

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బొంత సంతోష్(19) అనే యువకుడు దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.