KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన రైతు నాంపల్లి సాంబయ్య ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్న ఆయన, సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామస్థులతో సంతోషంగా గడిపినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నట్లు పేర్కొన్నారు. సాంబయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
పొలం వద్ద రైతు ఆత్మహత్య


