హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్‌లో ఫోన్ స్పీకర్‌ ఆన్‌ చేస్తే జైలుకే!

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఫోన్ స్పీకర్ మోడ్‌లో పెట్టి పాటలు వినడం, వీడియోలు చూడటం వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని దక్షిణ రైల్వే తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి రూ.1,000 వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రవర్తించే ప్రయాణికులను రైలు కోచ్ లేదా రైల్వే ప్రాంగణం నుంచి బయటకు పంపే అధికారం అధికారులకు ఉంటుందని హెచ్చరించింది.