హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాతులూరులో బెల్ట్ షాప్ నిర్వాహకుడి అరెస్ట్

PLD: నాదెండ్ల మండలం సాతులూరులో అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతున్న రజినీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చందవరం రైల్వే గేట్ సమీపంలో ఎస్సై కట్ట వెంకటయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా 10 క్వార్టర్ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.