హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేజారిన నామినేషన్ అవకాశం!

విశాఖ జిల్లా భీమిలి జోనల్ కార్యాలయంలో కాంగ్రెస్ నేత కాటా సన్యాసిరావుకు నిరాశ ఎదురైంది. 2వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన పత్రాలతో అక్కడికి చేరుకున్నారు. అయితే నిర్ణీత గడువు మధ్యాహ్నం 3 గంటలు దాటి 5 నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు.