హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు

VZM: ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామంలో ఓ మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పట్టణ ఎస్సై నవీన్ పడాల్‌కు నిన్న సమాచారం రాగా సిబ్బందితో దాడులు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న ఎం.సత్యవతిని అదుపులోకి తీసుకొని, ఆమె వద్ద నుంచి 14 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.