హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బందోబస్తును పర్యవేక్షించిన ఏఎస్పీ జయశర్మ

KRNL: ఆదోనిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏఎస్పీ జయశర్మ పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.