తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ శ్రీవారికి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి ప్రత్యేక పూజలు, విశేష సమర్పణలు జరిపిన అనంతరం స్వర్ణరథోత్సవం ప్రారంభం కానుంది. స్వర్ణరథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనుండటంతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నేడు శ్రీవారి స్వర్ణరథోత్సవం


