ELR: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మహిషాసుర మర్దిని అలంకారంలో గంగానమ్మ


