హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి ఇంటిపై దాడి

KDP: ప్రొద్దుటూరులో YC మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. శాస్త్రీనగర్‌లోని ఆయన నివాసంపై రాత్రి 1.47 గంటలకు మాస్కులు ధరించి వచ్చిన వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాటు వాహనాల అద్దాలు పగలగొట్టారని నరసింహారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.