దుర్గాపూజ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నారీశక్తికి ఇచ్చే గౌరవానికి ప్రతీక అన్నారు. మహిళలను గౌరవించడమే అమ్మవారికి మనం చేసే పూజ అని సందేశమిచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గాపూజ నిదర్శనమన్నారు. ఈ పండుగ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు.
వార్తలు
ప్రజలకు రాష్ట్రపతి దుర్గాపూజ శుభాకాంక్షలు


