NDL: శ్రీశైలంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొమ్మిదో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భ్రమరాంబ అమ్మవారు సిద్ధిదాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
సిద్దిదాయని అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు


