SKLM: ఆమదాలవలసలోని శ్రీ పాల పోలమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఇవాళ శ్రీ మహిషా సురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నర్సింగరావు,సాయి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు


