హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం

NDL: ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీస్ అవుట్‌పోస్ట్ వెనుక బీగాల ఆంజనేయస్వామి ఆలయ మార్గంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్‌డ్రింక్స్ షాప్, రెండు హోటళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది.