హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

JN: రఘునాథపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బి. రవీంద్రనాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, ఓపీ, వైద్య సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించాలని, సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.